- Advertisement -
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పలకరింపులు
అబూధాబి : ప్రధాని మోడీ తమ యుఎఇ పర్యటనలో భాగంగా భారతీయ సంతతివారితో ఆత్మీయంగా ఇష్టాగోష్టికి దిగారు. ఈ దశలో ఆయన అక్కడి భారతీయులను ఉద్ధేశించి నాలుగు దక్షిణ భారతీయ భాషలలో మాట్లాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వారిని పలకరించారు.
యుఎఇలో ఎక్కువగా ఈ రాష్ట్రాలకు చెందిన వారు వివిధ వృత్తులలో స్థిరపడి ఉన్నారు. అబూధాబిలో జరిగిన అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ఆయన వారివారి భాషలలోనే ముచ్చటించడం ఆసక్తికరం అయింది. యుఎఇలో భారతదేశానికి చెందిన సంతతి అత్యధిక సంఖ్యలో ఉంటోంది. మూడున్నర కోట్ల మంది భారతీయ సంతతివారు ఉండటంతో దేశ జనాభాలో వీరి సంఖ్య 35 శాతంగా నిలిచింది. ఏ ఇతర దేశం వారు ఇక్కడ ఇంతటి సంఖ్యలో లేకపోవడం మరో కీలక విషయం.
- Advertisement -