Monday, November 25, 2024

రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ పర్యటన

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు ఎత్తుగడలు
ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం, ఆరు గ్యారెంటీలను తప్పుదారి పట్టించేందుకు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తెరపైకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందుగానే మేడిగడ్డ పర్యటన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పర్యటన చేస్తున్నారో, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచనతోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను సైతం ముగించుకొని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మేడిగడ్డ సందర్శనకు తీసుకుపోయారని విమర్శించారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్నడంపై గతంలోనే జల శక్తి వనరుల శాఖ మంత్రికి లేఖ రాశామని సీబీఐ ద్వారా విచారణ చేయాలని గత ప్రభుత్వం , ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తోందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేస్తే తప్పకుండా మద్యం కేసులో కవితను విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను రాజకీయ కుట్రలను బయటపెడుతామని ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పొత్తులు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని,10 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో మోదీ విజయం సాధించారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బలపడ్డ స్థానాలను సైతం బిజెపి కైవసం చేసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో ఓవైసీ సీటుపై కూడా కమలం పువ్వు జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే తమ ఓటును మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మెజార్టీ సాధించే మార్గాలు స్పష్టంగా ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలన్నీ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నాయని ఈ రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News