యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ’ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొత్త కంటెంట్ తో కొత్త జోనర్ లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, క్రేజ్ వస్తుందని నమ్మి చేశాం.
సందీప్ కిషన్ కెరీర్లో హయ్యట్ బడ్జెట్ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్ బిజినెస్ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా వున్నాం. ఆనంద్ చెప్పిన దానికి రెండింతల అద్భుతంగా సినిమాని తీశారు. ‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ థ్రిల్లర్. ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో47 నిమిషాల అద్భుతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే చిత్రమిది. శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్‌గా సందీప్ కిషన్ విని దర్శకుడిని వినమన్నారు.
అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. ఇందులో నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది. ’భైరవకోన’ ఊరు గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు అద్భుతంగా వుంటాయి. ‘భైరవకోన’లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగ్‌గా వుంటుంది. -సందీప్ కిషన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన కెరీర్‌కి, మా బ్యానర్ కి ఇది నెంబర్ 1 సినిమా అవుతుందనే నమ్మకం వుంది. ఇక అల్లరి నరేష్‌తో నిర్మిస్తున్న బచ్చల మల్లి సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాం”అని అన్నారు.