Monday, December 23, 2024

యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు

- Advertisement -
- Advertisement -

ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన

అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడులు, పురావస్తు నిర్వహణ వంటి కీలక రంగాలలో సహకారం కోసం పది ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా బుధవారం అబూ ధాబిలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం యుఎఇ అధ్యక్షుడు షేఖ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశం సందర్భంలో పది అవగాహన పత్రాలు (ఎంఒయులు), ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

విద్యుత్ అనుసంధానం, వాణిజ్యం రంగంలో ఎంఒయు ఇంధన భద్రత, వాణిజ్యానికి సంబంధించిన సహకారంతో పాటు హరిత హైడ్రోజన్‌పైన, ఇంధన శక్తి నిల్వపైన దృష్టి కేంద్రీకరించనున్నట్లు క్వాత్రా తెలిపారు. భారత్, మధ్య ప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి) సాధికారత, నిర్వహణ సహకారానికి సంబంధించిన అంతర్ ప్రభుత్వ పరిధి ఒప్పందం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత పెంచుతుందని ఆయన తెలిపారు.

‘ఐఎంఇసి ఎంత త్వరగా కార్యరూపం దాలుస్తుందో, సంబంధిత దేశాల మధ్య దృఢమైన, లోతైన, మరింత విస్తృత ప్రాంతీయ అనుసంధానానికి సంబంధించి ఒక లక్షం’ అని క్వాత్రా వివరించారు. గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జి20 శిఖరాగ్ర సదస్సు సమయంలో ఈ కారిడార్‌పై ప్రకటన వెలువడింది. ఐఎంఇసిని చైనా ఆధ్వర్యంలోని ‘బెల్ట్, రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ)కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఐఎంఇసి భారత్, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, యూరప్‌లను అనుసంధానిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News