Thursday, December 19, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్ నుంచి విద్యుత్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. దీని ద్వారా 1.6 కోట్లకు పైగా ఇళ్లు వెలుగును చూస్తాయి. గుజరాత్‌లోని ఖవ్డాలో ఉన్న 551 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను కంపెనీ ప్రారంభించగా, ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 15 వేల ఉద్యోగాలు వస్తాయని, 5.8 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు కూడా తగ్గనున్నాయని కంపెనీ తెలిపింది.

దీని ద్వారా నేషనల్ గ్రిడ్‌కు విద్యుత్తు సరఫరా అవుతుంది. ఈ ప్లాంట్‌తో 1.6 కోట్లకు పైగా ఇళ్లను వెలిగించవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే ఏటా 58 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. ఈ ప్లాంట్ నుంచి 81 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకారం, ఈ ప్లాంట్ పని కేవలం 12 నెలల్లో పూర్తయింది. కంపెనీకి చెందిన ఈ ప్లాంట్‌లో దాదాపు 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంట్ దాదాపు 15,200 ఉద్యోగాలను సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News