- Advertisement -
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీస్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ హింసకు దారి తీసింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు బాధితులైన మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు బుధవారం గెస్ట్‌హౌస్ నుంచి సందేశ్ ఖాలీకి బయలుదేరారు. సందేశ్ కాలీలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున వీరిని పోలీస్‌లు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయ గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కోల్‌కత్తాకు తరలించారు. సందేశ్‌కాలీలో టిఎంసి నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా బెనర్జీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -