Tuesday, December 3, 2024

ప్రియుడ్ని ఇంటికి పిలిచి చంపించిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: వేధింపులకు గురి చేస్తున్న ప్రియుడ్ని ప్రియురాలు పథకం ప్రకారం తన కుటుంబ సభ్యులతో హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కమ్మరిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పొన్నారం గ్రామానికి చెందిన చెందిన శేఖర్, కమ్మరపల్లికి చెందిన పద్మను 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కమార్తెలు ఉన్నారు. పొన్నారం గ్రామానికి చెందిన మహేందర్ (28) వరి కోసే వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తుండగా పద్మ పరిచయమైంది. పరిచయం ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నాలుగు నెలల క్రితం పద్మ, మహేందర్‌తో కలిసి వెళ్లిపోయింది. పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆమెలో మార్పు లేదు. దీంతో భర్తతో ఉండలేనని, ప్రియుడితో ఉంటానని వివరణ ఇచ్చింది. మహేందర్, పద్మ మధ్య మనస్పర్థలు రావడంతో నెల రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చింది. కమ్మరిపల్లికి వచ్చి ఆమెను ప్రియుడు ఇబ్బంది పెడుతుండడంతో అతడిని చంపేయాలని తల్లిదండ్రులు, భర్తకు తెలిపింది.

మంగళవారం రాత్రి పద్మ మహేందర్‌కు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని రావాలని కబురు పంపింది. మహేందర్ ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ గ్రామానికి చేరుకొని ఇంటి సమీపంలో వారిని ఉండమని అతడు ఇంట్లోకి వెళ్లాడు. మహేందర్ ఇంట్లోకి వెళ్లగానే కళ్లలో కారం చల్లి కర్రలతో చితకబాదడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని ఎండ్ల బండిలో గ్రామ శివారులోకి తీసుకెళ్లి తగలబెట్టాడు. మహేందర్ అరుపులు కేకలు వినపడడంతో ఇద్దరు స్నేహితులు అతడి తమ్ముడికి సమాచారం ఇచ్చారు. తమ్ముడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకునే సరికి మృతదేహం కాలుతుండడంతో బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు సుగుణక్క, మొగిలి ఓదెలు, పద్మ, శేఖర్‌ను చెన్నూరు బస్టాండ్‌లో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై హత్యానేరం, ఎస్‌సి, ఎస్‌టి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News