Saturday, November 23, 2024

ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని ధర్మాసనం తెలిపింది. గురువారం ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీంపై విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల బెంచ్.. ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీం నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ అమ్మకూడదని.. ఎలక్టోరల్‌ బాండ్స్‌ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

బ్లాక్‌మనీ నిర్మూలనకు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. విరాళాలు ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచడం కరెక్ట్ కాదన్న న్యాయస్థానం.. పార్టీలకు వచ్చిన ఫండ్‌ ఎవరిచ్చారో తెలియాలని.. 2019 నుంచి జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ బహిర్గతం చేయాలని.. ఎన్నికల కమిషన్‌, ఎస్‌బీఐలు ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్ నుంచి విద్యుత్ ఉత్పత్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News