Saturday, November 23, 2024

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం: డిప్యూటీ సిఎం భట్టి

- Advertisement -
- Advertisement -

పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ ను రూపొందించామని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై భట్టి విక్రమార్క సమాదానమిస్తూ ప్రసంగించారు.

బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజికన్యాయం చేశామని భట్టి చెప్పారు. గతంలో తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని.. ఏటా 20శాతం బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు. బడ్జెట్ లో కేటాయింపుల తప్ప, నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ రూ.2.75లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామని.. ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని చాలా మందికి అడిగారని.. బడ్జెట్ ప్రకారమే ఆదాయం, వ్యయం ఉండాలని మా ఆలోచనని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు, వ్యయానికి 5శాతం మించి తేడా లేకుండా చూడాలన్నారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని… అసమానతలను బడ్జెట్ ద్వారా తొలిగించేందుకు కృషి చేశామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News