Friday, November 22, 2024

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్లు అప్పుల భారం ఉందని.. వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై భట్టి విక్రమార్క సమాదానమిస్తూ ప్రసంగించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. బడ్జెట్ ప్రకారం నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వం.. మైనార్టీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదని.. ఎఫ్ఆర్ బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు.

ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో రూ.53వేల కోట్లు కేటాయించామని భట్టి చెప్పారు. బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7,740 కోట్లు కేటాయించామని.. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం రూ.2,418 కోట్లు..రూ.500కు గ్యాస్ సిలిండర్ కోసం రూ.723 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతు భరోసా కోసం బడ్జెట్ లో రూ.15,075కోట్లు కేటాయించామని డిప్యూటీ సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News