- Advertisement -
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా మోటో జి04 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16ఎంపి + 5ఎంపి కెమెరా, యునిసోక్ టి606 ప్రాసెసర్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. మోటరోలా కొత్తగా ప్రారంభించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జిబి, 8జిబి అనే రెండు ర్యామ్ ఎంపికలు ఉన్నాయి. స్టోరేజ్ విషయానికొస్తే, ఇది 64జిబి, 128జిబి అనే రెండు ఎంపికలను కలిగి ఉంటుంది. మోటో జి04 స్మార్ట్‌ఫోన్ 4 జిబి + 64జిబి స్టోరేజ్ ఎంపికను కంపెనీ రూ. 6,999గా, 8జిబి + 128జిబి స్టోరేజ్ ఆప్షన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,999గా నిర్ణయించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12:00 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు.
- Advertisement -