Friday, December 20, 2024

సర్ఫరాజ్ తండ్రి భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా సర్ఫరాజ్‌కు జాతీయ జట్టులో చోటు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సుదీర్ఘ కాలం పాటు టీమిండియాలో స్థానం కోసం ఎదురు చూసిన సర్ఫరాజ్ మధుర స్వప్నం గురువారం నెరవేరింది. భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. అది చూసిన సర్ఫరాజ్ త్రండి నౌషాద్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు.

ఉబికి వస్తున్న కన్నీళ్లను కట్టడి చేయలేక ఏడిచేశారు. తనయుడి చేతుల్లో నుంచి ఆ క్యాప్‌ను అందుకుని ముద్దులు పెట్టారు. అంతేగాక కొడుకును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం మైదానంలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సయితం భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, సర్ఫరాజ్‌ను క్రికెటర్‌గా తీర్చడంలో ఆయన తండ్రి నౌషాద్ పాత్ర చాలా కీలకం. ఆయనే సర్ఫరాజ్‌తో పాటు ముషీర్ ఖాన్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కొడుకులను ప్రతిభావంతులైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో నౌషాద్ ఖాన్ పాత్ర వెలకట్టలేనిది. ఇటీవల ముగిసిన అండర్19 వరల్డ్‌కప్‌లో ముషీర్ ఖాన్ రెండు శతకాలు సాధించి సత్తా చాటాడు. తాజాగా సర్ఫరాజ్ టీమిండియాలో చోటు సంపాదించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News