- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం చరిత్రాత్మకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం సంపద పంచాలని సూచించారు. తెలంగాణలో అన్ని కులాలను గణన చేస్తామని, కులగణనతో పాటు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సర్వే చేస్తామని వివరించారు. సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో కులగణనపై హామీ ఇచ్చామని, అమలు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సర్వే అనేది సర్వరోగ నివారిణిలా ఉంటుందని చెప్పారు.
- Advertisement -