- Advertisement -
గంగాధర: గంగాధర మండలం గర్షకుర్తిలో మరమగ్గాల కార్మికులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి బీటీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. విజిలెన్స్ అధికారులు మరమగ్గాలను సీజ్ చేసి పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, సంబంధిత జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, బతుకమ్మ చీరల తయారీ తరహాలో చీరల తయారీకి ప్రభుత్వం అవకాశం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న బతుకమ్మ చీరల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మరమగ్గాల కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -