Friday, December 20, 2024

25 కుక్కలపై దుండగుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

అడ్డాకుల : మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేపింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 25 కుక్కలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. 20 కుక్కలు తుపాకీ తుటాలకు మృతి చెందాయి. మరో ఐదు త్రీవంగా గాయపడ్డాయి. కుక్కల అరుపులకు, తుపాకీ శబ్ధాలకు ఉలిక్కిపడిన గ్రామ ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటికి రాలేదు. సమాచారం తెలుసుకున్న సిఐ రామక్రిష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు, పశువుల డాక్టర్ రాజేష్ ఖన్నా, పోలీసులు, ఘటన స్థలానికి చేరుకొని కుక్కలను పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. అంతకుముందు గ్రామస్థులు రోడ్డుపై పడిన బుల్లెట్ వెనుక భాగమైన కోకెను ఎస్‌ఐ శ్రీనివాసులకు అందజేశారు.

రాత్రి 2 గంటల సమయంలో 4 వ్యక్తులు సిల్వర్ కలర్ కారులో వచ్చి కారులో నుండే గన్‌తో వీధి కుక్కలను కాల్చారని, తిరిగి వెళ్లిపోయి రెండోసారి గ్రామానికి వచ్చి మరోసారి కుక్కలను కాల్చారని ప్రత్యేక సాక్షి ఆర్మీలో పనిచేసి, రిటైరైన జవాన్ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. దీంతో పోలీసులు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, అతన్ని అతనితో ఉన్న లైసెన్సుడ్ గన్నును తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు. వీధి కుక్కలను పోస్టుమార్టం చేశామని, వేర్వేరుగా ఫోరెన్సిక్‌లకు పంపించామని పశువుల డాక్టర్ రాజేష్ ఖన్నా తెలిపారు. గాయాలు బుల్లెట్ గాయాలో కాదో అని పోలీసులకు మాత్రమే చెబుతామని అన్నారు. గ్రామ కార్యదర్శి నుంచి ఫిర్యాదు తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News