Friday, December 20, 2024

కెసిఆర్ బాటలో చంద్రబాబు !!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నడిచిన బాటలోనే టిడిపి అధినేత చంద్రబాబు కూడా నడుస్తున్నారా? అంటే ఆ పార్టీ వర్గాల నుండి ఔననే సమాధానమే వినిపిస్తోంది.త్వరలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న క్రమంలో మళ్లీ తాను సిఎం కావాలని భావిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ రాజ శ్యామల యాగం జరగనుంది.

ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. సుమారు 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొని చంద్రబాబు చేత యాగం చేయించారు.రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News