- Advertisement -
హైదరాబాద్ : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ను శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ చేసినట్లు దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం నాంపల్లి కోర్టు కొట్టేసింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ను శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అఫిడవిట్ టాంపరింగ్‌కు పాల్పడిన శ్రీనివాస్ గౌడ్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌లో వెల్లడించాడు. ఈ పిటి షన్‌పై చాలా కాలంగా ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్‌ను నాంపల్లి హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసులో శ్రీనివాస్ గౌడ్‌కు భారీ ఊరట దక్కినట్లైంది.
- Advertisement -