Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా 25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో భారీగా అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా శుక్రవారం మరోసారి పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 25 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎం. నగేష్, వరంగల్ అదనపు కలెక్టర్‌గా గట్టు సంధ్యారాణి, సికింద్రాబాద్ ఆర్డీఓగా ఎం. దశరథ, హుజురాబాద్ ఆర్డీఓగా శకుంతల,

హైదరాబాద్ ఆర్డీఓగా కె. మహిపాల్, కీసర ఆర్డీఓగా కె.వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఆర్డీఓగా కొప్పుల వెంకట్ రెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓగా ఎస్. రాజు, వరంగల్ డిఆర్‌ఓగా కనుగుల శ్రీనివాస్, నల్లగొండ డిఆర్‌ఓగా డి.రాజ్యలక్ష్మీ, సంగారెడ్డి డిఆర్‌ఓగా డి. పద్మజా రాణిలను నియమించారు. భద్రాద్రి రామాలయ ఈఓగా ఎల్. రమాదేవిని కొనసాగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News