- Advertisement -
హైదరాబాద్ : ఎపి ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఎసిబి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఎసిబి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబు పేరును సిఐడి ఎ1గా చేర్చింది. అంతేకాదు ఎ2గా వేమూరి హరికృష్ణ, ఎ3గా కోగంటి సాంబశివరావును చేర్చారు. ఈ మేరకు ఎసిబి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా ఎపి పైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎపి సిఐడి 2021లో కేసు నమోదు చేసింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ కేసులో 25వ నిందితుడిగా చేర్చారు. రూ.114 కోట్లు దుర్వినియోగం చేశారని సిఐడి ఎఫ్‌ఆర్ నమోదు చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో భాగంగా చంద్రబాబు పేరును ఎ1గా చేర్చారు.
- Advertisement -