రాజ్‌కోట్: మూడో టెస్టు నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధంతరంగా తప్పుకున్నాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో టెస్టు మ్యాచ్ మధ్యలో నుంచి అతడు ఇంటికి వెళ్లాడు. అశ్విన్ తన తల్లిని చూసేందుకు చెన్నై వెళ్లాడు. అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. మిగతా రెండు టెస్టులకు అశ్విన్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అశ్విన్ తల్లికి అనారోగ్య సమస్యలు రావడంతో అతడు మూడో టెస్టుకు దూరమయ్యాడని బిసిసిఐ ట్విట్టర్ లో వెల్లడించింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని బిసిసిఐ పేర్కొంది. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఒక వికెట్ తీసి అతడు 500 వికెట్ల క్లబ్బులో చేరాడు. రెండో రోజు మ్యాచ్ లో చివరలో 37 పరుగులు చేశాడు. ఇప్పటికే గాయాల బారిన కెఎల్ రాహుల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లీ గత మూడు టెస్టులకు దూరంగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ లేమీతో బాధపడుతుండడంతో పాటు గాయాలపాలయ్యాడు. రవీంద్ర జడేజా గాయా నుంచి కొలుకొని మూడో టెస్టులో అద్భుతమైన సెంచరీ చేశాడు.
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ… మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -