Monday, December 23, 2024

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 319 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. ఇంకా భారత జట్టు 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ డకెట్ ఒక్కడే భారీ సెంచరీ చేయడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ డకెట్(153), బెన్ స్టోక్స్(41), జోయ్ రూట్(18), బెన్ ఫోక్స్(13), జాక్ క్రాలే(15), రెహాన్ అహ్మద్(06), టామ్ హార్ట్‌లే(09), జేమ్స్ అండర్సన్(1), మార్క్ వుడ్(04 నాటౌట్) పరుగులు చేశారు.  భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో ఒక వికెట్ తీశారు.

టీమిండియా మొదటి ఇన్నింగ్స్: 445

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News