Thursday, November 28, 2024

‘రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు ఎందుకు పెంచారు’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరానికి ఏడాదికి రూ.25 వేల కోట్ల వ్యయం జరిగిందని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నీటిపారుదల రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి ప్రసంగించారు. మహారాష్ట్రతో చర్చించి 148 మీటర్లకు ఒప్పించి ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారని, వంద కిలో మీటర్ల దూరంలోని వంద మీటర్ల వద్ద కాళేశ్వరం మొదలు పెట్టారని, రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు ఎందుకు పెంచారని మండిపడ్డారు. దనదాహంతో తెలంగాణను అతలాకుతలం చేశారని దుయ్యబట్టారు. చుక్క నీరు రాలేదని, తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం నిర్వహణ గుదిబండగా మారిందన్నారు. ప్రాణహిత కింద ముంపునకు గురయ్యేది కేవలం మూడు వేల ఎకరాలు అని, పోలవరం నిర్మాణ సమయంలో రెండు లక్షల ఎకరాలు ముంపునకు గురవుతుందని, 152 మీటర్ల వద్ద ప్రాజెక్టు కట్టే ఆలోచన గత ప్రభుత్వానికి ఎందుకు చేయలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూడు వేల ఎకరాల ముంపు కోసం ప్రాజెక్టును 148 మీటర్లకు తీసుకొచ్చారని, తప్పులపై తప్పులు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. తప్పులను ఒప్పుకుని ప్రభుత్వానికి సహకరించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు భట్టి సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News