Monday, December 23, 2024

కెమెరాకు చిక్కిన నల్లచిరుత

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులోని నీలగిరి అటవీ, పర్వత ప్రాంతంలో ఓ నల్లచిరుత పులి (బ్లాక్ పాంథర్) ఓ ఇంటి వెలుపల సంచరించింది. సంబంధిత ఫోటోను అటవీశాఖాధికారి ప్రవీణ్ కశ్వాన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెలువరించారు. అక్కడ అమర్చి ఉన్న సిసిటీవీ కెమెరాల్లో తనకు లభ్యమైన ఫోటోలను అధికారి వెలుగులోకి తీసుకువచ్చారు. గత సంవత్సరం ఆగస్టులో ఈ నల్లచిరుత ఇంటి ఆవరణలో ముందుభాగంలో కలియతిరిగింది. చాలా సేపు అక్కడే ఉంది. ఈ బ్లాక్ పాంథర్ ఇతరులకు ఎవరికైనా కన్పించిందా? కన్పిస్తే తెలియచేయండని నెటిజన్లను కోరారు. 1 లక్షకు పైగా ఈ వీడియో సందర్శించారు. అమ్మో బ్లాక్ పాంథర్, గుబులు , హోయలుతో ఉందని ఓ నెటిజన్ స్పందించారు.

జీవితకాలం దుర్భిణిలు వేసుకుని చూసినా కన్పించని ఈ జీవి ఇక్కడ హాయిగా తిరగడం, పైగా క్షేమంగా తిరిగివెళ్లడం లక్కే అని మరో వన్యప్రాణి ప్రేమికుడు తెలిపారు. సాధారణంగా బ్లాక్ పాంథర్ మానవ సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవు. పిరికి అని చెపుతారు. కానీ ఇక్కడ సందడి చేసి వెళ్లడం వండరే అని ఓ పౌరుడు స్పందించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఒడిషాలో జనావాస ప్రాంతాలలో కూడా ఓ బ్లాక్‌టైగర్ కన్పించి వెళ్లింది. పులుల జాతుల్లో ఈ సుమత్రన్ బ్లాక్ టైగర్లు అంతరించిపోతున్న వైనం ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి కేవలం 500 నుంచి 600 వరకూ ఉన్నాయి. ఒడిషాలోని అభయారణ్యంలో 40 వరకూ ఈ జాతి పులులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News