Sunday, December 22, 2024

కారులో డబ్బులు చోరీ చేసిన డ్రైవర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో ఉన్న డబ్బులు చోరీ చేసిన డ్రైవర్‌ను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంఓని శ్రీపురం కాలనీకి చెందిన రాజ్‌కుమార్ ఖేడియా వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన కారులో రూ.9లక్షలు తీసుకుని బయలు దేరాడు. డబ్బులు కారులో ఉండగానే ఇంట్లోకి వెళ్లిపోయాడు. తెల్లవారి కారును డ్రైవర్ సురేంద్రచారికి ఇచ్చాడు. డ్రైవర్ పనిమీద అక్కడి నుంచి సలీంనగర్,కాటేదాన్‌కు వెళ్లి తిరిగి మధ్యాహ్నం 2గంటలకు వచ్చాడు.

అప్పుడు కారు యజమానికి కారులో రూ.9లక్షలు ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే కారులో తనఖీ చేయగా ఎక్కడా దొరకలేదు. వెంటనే మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News