Thursday, December 19, 2024

వార ఫలాలు 18-02-2024 నుండి 24-02-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొంత ఓర్పు, సహనం వహించవలసిన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అలస్యంగా అయినా వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు విలాస  వస్తువులు,  బట్టలు, బంగారం వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు  కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్య పరంగా శారీరక అనారోగ్యం కంటే అలసట, అశాంతి చోటు చేసుకుంటాయి.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం, మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నపటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, వ్యవహారాలలో  మీ ఆలోచన శక్తి మెరుగు పడుతుంది. వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని  చెప్పవచ్చు. సంతాన పరంగా  వారి  విజయాలు మీకు ఆనందాన్ని కలుగచేస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా ఒక పనిని చేయదలచుకొంటె  వాయిదాలు వేయకుండా చేసుకోవడం మంచిది. వారం ప్రథమార్ధంలో  అనుకూలమైన ఫలితాలుంటాయి.

మిథునం: మిథునరాశి  వారికి  ఈవారం   అన్ని విధాలా  కొంత ఇబ్బందులు, చికాకులు ఉండే అవకాశాలున్నాయి. అయితే కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఉండవచ్చు.  మాటలో కఠినత్వం అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు ఈవారం సామాన్యంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి.  విద్యార్థిని విద్యార్థులు ఆలోచన శక్తి తో ముందుకు సాగండి.

కర్కాటకం : కర్కాటకరాశి వారికి ఈ వారం  అత్యంత శుభదాయకమైన ఫలితములు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకు ప్రజాభిమానం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. విద్యార్థినీవిద్యార్థులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద కర్కాటకరాశి  వారికి అన్ని విధముల బాగున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన  పనులు ఆలస్యం అవుతాయి.

సింహం: సింహరాశి వారికి ఈవారం వ్యవసాయదారులకు, వినోద రంగం వారికి అనుకూలమైన ఫలితాలుండే అవకాశాలున్నాయి. అయితే కుటుంబ పరంగా మాత్రం కొంత మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో మార్పులకు ఇది అంత మంచి సమయం కాదు.  ఆరోగ్య పరంగా శారీరక అనారోగ్యం కంటే మానసిక ఆందోళనలు, ఆత్రుత వంటివి ఉంటాయి.  టెన్సన్స్ ఎక్కువ వలన శారీరక బలహీనత అనేది ఏర్పడుతుంది. నూతన విద్యా విషయములు, కోర్సులు వాటి గురించి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి.

కన్య:  ఈ వారం కన్యా రాశి  వారికి  ఆర్ధికంగా అన్ని విధాల అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా  బయట పలుకుబడి పెరుగుతుంది.  ఉద్యోగస్తులకు ఈవారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థినీ విద్యార్థులకు ఈవారం బాగుంది, వీసా కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది.

తుల: ఈవారం తులారాశి వారికి  స్వల్ప ఒడిదుడుకులు తప్పా అన్ని విషయములలో అనుకూలమైన ఫలితాలుంటాయనడంలో సందేహం లేదు.  ఉద్యోగ పరంగా అభివృద్ధి, ఆదాయం అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు అనుకున్న ప్రాజెక్టులు రావడం, అలాగే విషయ వ్యవహారాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి.  స్నేహితులతో సాన్నిహిత్యం, వినోద యాత్రలు వంటివి ఆనందాన్ని ఇస్తాయి. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుండే సమయం అని చెప్పవచ్చు.
 
వృశ్చికం: వృశ్చికరాశి వారికి  ఈవారం  పూర్తి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి, ద్వితీయార్థంలో  వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. . ఓర్పు సహనం చాలా అవసరం.ఉద్యోగస్తులకు కూడా అధికారులతో కొంత అసంతృప్తి ఏర్పడవచ్చు.  నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం.

ధనస్సు: ఈవారం ధనుస్సురాశి వారికీ  కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ధన నష్టంతో  పాటు కొంత  కీర్తికి భంగం వాటిల్లే  అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి పని  ఒత్తిడితో పాటు ఆలస్య ఫలితాలుండే అవకాశాలున్నాయి. ఆరోగ్య పరంగా దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నట్లైతే కొంత జాగ్రత్త వహించండి.  పారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.

మకరం: మకరరాశి వారికి ఈ వారం  కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం చేత  ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అనవసరమైన తగాదాలలోకి వివాదములలోకి వెళ్లడం మంచిది కాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే  విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, తరువాత పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. అనవసరమైన ఆందోళనలు చెందకండి.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం  అనుకూలమైన ఫలితాలు  గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి సానుకూలమైన లాభాలు, స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. యువత కూడా  తస్మాత్  జాగ్రత్త వహించండి.  సంతాన పరంగా వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగ చేస్తుంది. గౌరవం, తృప్తి లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి

 మీనం: ఈ వారం మీనరాశి వారికి శ్రమ అధికమయినప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు గతంలో ఏర్పడిన చికాకులు, తగాదాలు,  ఆర్ధిక ఇబ్బందులు కూడా  తొలగినట్టు అనిపిస్తాయి.  అదృష్టం కంటే కష్టే ఫలి అన్నట్టుకష్టం తర్వాత వచ్చే విజయం ఆనందం కలుగ చేస్తుంది. మీగురించి మాత్రమే మీరు పోరాడండి. వివాహ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది.  విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News