Friday, December 20, 2024

కాళేశ్వరం నిట్టనిలువునా చీలింది

- Advertisement -
- Advertisement -

తప్పు కప్పిపుచ్చుకోవద్దు, నిజం ఒప్పుకోండి : భట్టి విక్రమార్క

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చింది చిన్న పగులు అని అంటున్నారని, అది పగులు కాదని, నిట్ట నిలువునా చీలిపోయిందంటూ డిప్యూ టీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శనివారం ఇరిగేషన్‌పై చర్చ ఘాటుగా నడుస్తున్న సందర్భంలో ఆయన మట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నిర్మాణమే కాదు, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ఇదే పరిస్థితికి వస్తాయని ఎన్ డిఎస్‌ఎ చెప్పిందన్నారు. ఇదేదో తాము ఊహించి చెప్పడం లేదని, జ్యోతిష్యం కాదని, నిపుణుల చెప్పిన మాట అంటూ సభలో చెప్పారు. గత ప్రభు త్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును ఊటంకిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో ఎందుకు పని చేయించ లేదని అడిగారు. ఎస్సారెస్పీ, దేవాదుల, రాజీవ్ సాగర్‌లను పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. వీటిని వదిలేసి లక్ష 72 వేల కోట్లకు బడ్జెట్ పెంచి కాళేశ్వరం కట్టారన్నారు.

ఇల్లు కట్టుకుంటేనే మనం ఇంజనీర్‌ను పెట్టుకుంటాం.. అట్లాంటిది లక్షల కోట్ల రూపాయలతో కడుతున్న కాళేశ్వరం విషయంలో కెసిఆర్ చేసింది ఏమిటి? అని ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును నేనే కడతానంటూ ఇప్పుడు ఏ పరిస్థితికి తీసుకు వచ్చారో చూడండి. మీరు కట్టిన కాళేశ్వరం నిట్ట నిలువునా చీలిందని,  గత గవర్నర్ హరీశ్ రావుకు కాళేశ్వర రావు అని పేరు పెట్టారని. ఇప్పుడు కూలిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తప్పు ఒప్పుకోవాలని’ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్నాం కాబట్టే మహారాష్ట్ర సిఎంకు లెటర్ రాశామన్నారు. దానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది.

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 152 మీటర్ల ఎత్తులో ఉన్నచోట ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకున్నారని సంబరాలు చేసుకున్నారని అదెలా సాధ్యం? అని పశ్నించారు. ఇక చివరికి వంద కిలోమీటర్లు కిందికి వచ్చి కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టులు కట్టారు. దీని కోసం మోటార్లని, పైపులని డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. మోటర్లు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంతకు తెచ్చారు? అని ప్రశ్నిం చారు. ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు తగుదునమ్మా అని మాట్లాడుతున్నారంటూ భట్టి విక్రమార్క హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News