Monday, January 20, 2025

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. గతేడాది జూలై 9వ తేదీన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు కోర్టులో పవన్ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంతో.. పవన్ పై కోర్టు 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. కేసు విచారణను నాలుగవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ జడ్జి శరత్‌బాబు పవన్ కు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News