- Advertisement -
ఒకప్పుడు రత్నాలు రాశులుగా పోసి అమ్మిన భాగ్యనగరం… ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకాశాన్నంటే భారీ భవంతులు ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరింది. దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తయిన భవంతి నిర్మాణం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఎస్ఎఎస్ ఇన్ఫ్రా సంస్థ కోకాపేటలో ఎస్ఏఎస్ క్రౌన్ పేరిట 57 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. దీని పొడవు 235 మీటర్లు. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఐదు టవర్లతో రూపొందుతున్న ఈ బహుళ అంతస్తుల భారీ భవంతి నిర్మాణం మార్చి 2027లో పూర్తవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్ లో 57 అంతస్తుల భవనం లేదు. ఎస్ఏఎస్ క్రౌన్ ఖాతాలో ఆ రికార్డు కూడా వచ్చి చేరడం విశేషం.
- Advertisement -