రాజ్‌కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత స్పినర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టు నడ్డివిరిచారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మార్క్‌వుడ్ 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలి బ్యాట్స్ మెన్ 20 పరుగులైనా చేయకుండ చాపచుట్టేశారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇప్పటికీ ఈ సిరీస్ లో భారత్ జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది. మూడో టెస్టు మ్యాచ్ రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీసి సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 122
MOMENT WHEN INDIA REGISTERED THEIR BIGGEST EVER WIN IN TEST CRICKET. 🇮🇳
– Captain Rohit Sharma creates history !!! 🫡 pic.twitter.com/Dse6fZ5pXl
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024