Saturday, December 21, 2024

నిరుద్యోగులకు రెండు దెబ్బలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం సమస్యపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం నిశితంగా విమర్శించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు ‘రెండు దెబ్బలు’ అన్న మాట అని ఆయన ఆక్షేపించారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రతి మూడవ యువకుడు ‘నిరుడ్యోగ రుగ్మత’తో బాధ పడుతున్నాడని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు. ‘లక్షన్నర పైచిలుకు ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉండగా కనీస విద్యార్హతలు కావలసిన ఉద్యోగాలకూ పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్‌డి స్కాలర్లు బారులు తీరుతున్నారు’ అని ఆయన ఆరోపించారు. ‘ముందుగా రిక్రూట్‌మెంట్ అవకాశాలు దాటి రావడం ఒక కలే. ఒకవేళ రిక్రూట్‌మెంట్ జరిగినా, ప్రశ్న పత్రం లీక్ అవుతుంది. ఒకవేళ ఆ పత్రం రాసినా ఫలితం వెల్లడి కాదు.

సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఫలితం వచ్చినా ఉద్యోగంలో చేరడం కోసం సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించవలసి వస్తుంది’ అని రాహుల్ అనానరు. సైన్యం నుంచి రైల్వేల వరకు, విద్య నుంచి పోలీస్ శాఱ వరకు రిక్రూట్‌మెంట్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన అనంతరం లక్షలాది మంది విద్యార్థులకు వయస్సు మీరి పోతోందని ఆయన ఆరోపించారు. ఇటువంటి నిస్పృహ వాతావరణంలో చిక్కుకున్న విద్యార్థి కుంగిపోతున్నాడని రాహుల్ అన్నారు. ‘వీటి వల్ల నిరాశకు గురైన అనంతరం తన డిమాండ్లతో ఆతను వీధుల్లోకి వస్తే పోలీసుల లాఠీ దెబ్బలు తప్పడం లేదు’ అని రాహుల్ అన్నారు.‘కాంగ్రెస్ విధానాలు యువత కలలకు న్యాయం చేకూర్చడమే. వారి ఓపిక వృధా కానివ్వం’ అని రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News