Thursday, December 19, 2024

సేవాభావంతో విధులు నిర్వర్తించాలి: టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సేవా భావంతో విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలని తమ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) సూచించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికే వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ (జెడ్‌ఎస్టిసి) లో ఆదివారం మేడారం జాతర టిఎస్‌ఆర్‌టిసి సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండి విసి సజ్జనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో సిబ్బందికి కేటాయించిన స్థానాలలో వారు మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. భక్తులకు నిస్వార్థమైన సేవలు అందించి, సంస్థకు మంచి పేరును తీసుకురావాలన్నారు. మేడారం జాతరకు మహాలక్ష్మీ- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, సిబ్బంది దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని జాతరలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు.
జీరో ఫెయిల్యూర్స్ తో పాటు యాక్సిడెంట్ ఫ్రీగా జాతర జరిగేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రైవర్లు ప్రమాదాలకు అవకాశం కల్పించవద్దని, భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.

మేడారం మహా జాతరలో దాదాపు 15 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి వసతి సౌకర్యం, భోజన విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించే టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపొందించిన టీ షర్ట్ లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఆర్‌టిసి సివోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఈడీలు ముని శేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, రఘునాథ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News