Friday, December 20, 2024

పాపులర్ సిఎం పట్నాయక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచా రు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైం ది. భారత్‌లో అత్యధిక కాలం సిఎంగా ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) కి చెందిన నవీన్ పట్నాయక్ 52.7 శాతం పాప్యులారిటీ రేటింగ్ ( ప్రజాదరణ) తో మొదటి స్థానంలో నిలిచారు.

2017 నుంచి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో రెండో స్థానాన్ని పొందారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 2021లో ఆయన బాధ్యతలు చేపట్టారు. , 42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో, త్రిపుర సిఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో నిలిచారు. 2016 లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సాహా 2022లో ముఖ్యమంత్రి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News