- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. భక్తుల ప్రస్తుతం మూడు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. ఆదివారం 70,338 మంది భక్తులు దర్శించుకోగా 22741 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
తిరుమలలో శ్రీవారి అర్జిత సేవా టికెట్లు మే నెల కొటాను ఫిబ్రవరి 19న ఉదయం పది గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
- Advertisement -