Saturday, December 21, 2024

కొందుర్గు ఐరన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేవారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News