Saturday, November 23, 2024

సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా కవులు, రచయితలు, కళాకారులు తమ యొక్క చారిత్రకమైన పాత్రను పోషించాలని బిసి మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఈ తరం… సెల్ ఫోన్ లో, యూట్యూబ్ లలో మునిగితేలుతున్నారని, దాని నుంచి బయట పడాలంటే పుస్తక పఠనమే అందుకు సరియైన మార్గమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ బుక్ ఫెయిర్ భిన్న భావాలకు కూడలి అని, భిన్న సంఘర్షణల కలయికని తెలిపారు.

సమాజంలోని విభిన్న అంతరాలు, అసమానతలు పోవాలంటే పుస్తకాలు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయన్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఈ పుస్తక ప్రతిష్ఠకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ఓయూ విసి డి. రవీందర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బుక్ ఫెయిర్ సెక్రటరీ ఆర్. వాసు,  ఉపాధ్యక్షులు పి. నారాయణ రెడ్డి, కోయా చంద్రమోహన్, కోశాధికారి పి రాజేశ్వరరావు, శృతికాంత్ భారతి, శోభన్ బాబు, జనార్థన్ గుప్తా, సూరిబాబు, బాల్ రెడ్డి, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News