Friday, November 22, 2024

పోరుబాటే…

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రతిపాదనను రైతులు సోమవారం రాత్రి తిరస్కరించారు. ఎటువంటి స్పష్టత లేని ఈ ప్రతిపాదన, ప్రత్యేకించి ఎంఎస్‌పిపై తా త్కాలిక ఐదేళ్ల భద్రత వంటి ప్రతిపాదనలు తమకు సమ్మతం కాదని రైతుల నేతలు ప్రకటించారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా లేని ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపిన రైతులు తమ ఆందోళన సాగుతుందని, ఈ నెల 21వ తేదీన ఢిల్లీచలో ప్రారంభిస్తామని ప్రకటించారు.

కేవలం పప్పులు, మొక్కజొన్నలు, పత్తికి ఎంఎస్‌పితో కేంద్రం చేతులు దులిపేసుకుంటే సరిపోదని, తాము మొత్తం 23 రకాల పంటలకు మద్దతు ధరలను కోరుతున్నామని , రైతులతో కాంట్రాక్టు ప్రతిపాదనలు ఎందుకు? అని ప్రశ్నించారు. కేంద్ర ంతో చర్చల ప్రక్రియతో నేరుగా సంబంధం లేకుం డా ఉన్న రైతుల సంఘాల ఏకీకృత సంఘం సం యుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ప్రతినిధులు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల ప్రధాన డిమాండ్ కేవలం పంటలన్నింటికి మద్దతు ధరలు, దీనికి చట్టబద్ధత అని, దీనిని పక్కదోవ పట్టించేందుకే కేంద్రం ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనలు చేసిందని ఎస్‌కెఎం నేతలు విమర్శించారు. తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, అయితే తమ డిమాండ్లకు అంగీకారం కీలకం అని తెలిపారు. బుధవారం తమ ఢిల్లీ యాత్ర సాగుతుందని తెలిపారు. కేంద్రం చెపుతున్న ఐదు పంటలతో పాటు మొత్తం 23 పంటలకు ఎంఎస్‌పి కల్పించాలని కోరారు. అయినా 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి మేనిఫెస్టోలో బిజెపి దీనిని తమ గ్యారంటీగా పేర్కొందని నేతలు గుర్తు చేశారు.

స్వామినాథన్ కమిషన్ నివేదికలోని కనీస మద్దతు ధర ఫార్మూలా సి2 ప్లస్ 50 శాతం ఎంఎస్‌పిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్ ప్లస్ 50 పద్థతి కాదని స్పష్టం చేశారు. పంటసాగు పెట్టుబడి వ్యయం ,భూమికౌలు రేటు ఇతరత్రా విషయాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు రైతులకు ఆదాయంలో భాగం ఉండాలనేదే కీలక అంశమని రైతులు తెలిపారు. వ్యవసాయ మంత్రి ఇతర మంత్రుల బృందం చర్చలలో చిత్తశుద్ధి లేదని , ఇప్పటికీ వీరికి రైతుల సమస్యల పరిష్కారంపై నిజాయితీ ఉన్నట్లు కన్పించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా తమ డిమాండ్లన్నింటినీ తీర్చాల్సి ఉంటుంది. అంతకుముందు పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, పత్తి వంటి పంటలను ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పి) కొనుగోలు చేయడంపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై రైతులు చర్చిస్తారని రైతు నాయకుడు శర్వన్ సింగ్ పంధెర్ సోమవారం స్పష్టం తెలిపారు. అయితే పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టబద్ధత కల్పించాలన్న డిమాండుపై వెనక్కు తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రుల బృందానికి రైతు నాయకులకు మధ్య ఆదివారం చర్చలు జరిగిన నేపథ్యంలో పంధెర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ డిమాడ్ల సాధన కోసం ఛలో ఢిల్లీ యాత్రను చేపట్టిన వేలాది మంది రైతులు పంజాబ్-హర్యానా సరిహద్దుల వద్ద మకాం వేసి ఉన్నారు. శంభూ సరిహద్దు వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడిన పంధెర్ కేంద్రం చేసిన ప్రతిపాదనలపై రైతులు చర్చిస్తారని తెలిపారు. పంటలకు చట్టబద్ధంగా భరోసాను కల్పించే కనీస మద్దతు ధర డిమాండు నుంచి రైతులు వెనక్కు తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. గుండెపోటుతో ఒక రైతు మరణించిన ఖనోరి సరిహద్దు పాయింట్ వద్దకు రైతులు వెళుతున్నారని ఆయన తెలిపారు. ఖనోరి సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతులలో ఒకరైన 72 ఏళ్ల వృద్ధుడొకరు ఆదివారం గుండెపోటుతో మరనించారు. కొద్ది రోజుల ముందు శంభూ సరిహద్దు పాయింట్ వద్ద 63 ఏళ్ల రైతు ఒకరు గుండెపోటుతో మరణించారు. కాగా..ఆదివారం కేంద్ర ప్రభుత్వం తరఫున వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో రైతు నాయకులతో జరిగిన నాలుగవ విడత చర్చలలో పాల్గొన్నారు.

ఎంఎస్‌పికి చట్టబద్ధతతోపాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణాల మాఫీ, విద్యుత్ ఛార్జీలను పెంచకూడదు. రైతులపై నమోదు చేసిన పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయడం, 2013 నాటి భూ సేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21రైతు ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు వంటి డిమాండ్లను రైతులు చేస్తున్నారు. రైతులతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్‌సిసిఎఫ్), జావీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) వంటి సహకార సొసైటీలు కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు లేదా జొన్నలు వంటి పంటలను వచ్చే ఐదేళ్ల వరకు ఎంఎస్‌పికి కొనుగోలు చేసేందుకు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదని, ఇందుకోసం ఒక పోర్టల్‌ను రూపొందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అంతేగాక రైతులతో చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వారి పంత్తి పంటను భారత పత్తి కొర్పొరేషన్(సిసిఐ) ఎంఎస్‌పిపై వచ్చే ఐదేళ్ల వరకు కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ ప్రతిపాదనపై రైతులతో సోమ, మంగళవారాలలో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకులు సమావేశం అనంతరం విలేకరులతో తెలిపారు. తమ ఇతర డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ఆశాభావాన్ని పంధెర్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుల ఛలో ఢిల్లీ మాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, అన్ని డిమాండ్లను పరిష్కరంచని పక్షంలో ఫిబ్రవరి 21న)బుధవారం) ఉదయం 11 గంటలకు ఛలీ ఢిల్లీ యాత్రను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే రైతుల ఇతర డిమాండ్లపై గోయల్ స్పందిస్తూ ఇవి విధానపరంగా తీసుకోవలసిన నిర్ణయాలని చెప్పారు. లోతుగా చర్చించకుండా వీటికి పరిష్కారం కనుగొనలేమన్నారు. ఎన్నికల తర్వాత డిమాండ్లపై చర్చలు కొనసాగతాయని గోయల్ అన్నారు. పంటలకు ఎంఎస్‌పిపై చట్టబద్ధత అనివార్యమని చర్చలలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. మంగళవారం పంజాబ్ నుంచి బయల్దేరిన రైతుల ఛలో ఢిల్లీ యాత్రను పంజాబ్, హర్యానా మధ్య సరిహద్దుల్లోని శంభూ, ఖనోరి పాయింట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News