- Advertisement -
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ ఖాతా హ్యాక్ విచారణను సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ముంబయి నుంచి గవర్నర్ తమిళిసై ఖాతా హ్యాక్ కు గురైంది. ముంబయిలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ ను దుండగులు వినియోగించి హ్యాక్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియడంలేదు. దర్యాప్తు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని రోజులుగా బోటిక్ షాప్ మూసివేసి ఉందని పోలీసుల విచారణలో తేలింది.
- Advertisement -