Saturday, December 21, 2024

రష్యాకు షాక్ ఇచ్చి… ఉక్రెయిన్ పారిపోయిన పైలట్ హత్య

- Advertisement -
- Advertisement -

మాడ్రిడ్: రష్యాకు చెందిన ఫైలట్ హెలికాప్టర్‌తో సహా ఉక్రెయిన్‌కు పారిపోయాడు, సదరు పైలట్ స్పెయిన్‌లో హత్యకు గురయ్యాడు. మ్యాక్సిమ్ కుజ్‌మినోవ్‌ది అనే వ్యక్తి రష్యాలో పైలట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఎంఐ-8 అనే హెలికాప్టర్‌తో అతడు ఉక్రెయిన్ కు పారిపోయాడు. దీంతో రష్యాకు అవమానకరంగా మారింది. దీంతో ఉక్రెయిన్ పాస్‌పోర్టు తీసుకొని స్పెయిన్‌లో జీవనం సాగిస్తున్నాడు. మ్యాక్సిమ్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో చనిపోయారు. కాలిపోయిన వాహనంలో మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో దేశంలో నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు రష్యా పైలట్ మ్యాక్సిమ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో రష్యాను మోసం చేసిన సైనికులు, గూఢాచారులపై ప్రాణాంతక దాడులు జరిగాయి. 2018లో రష్యా గూఢచారి సెర్గీ స్కిర్పాల్, అతడి కుమార్తె యూలియా ఆ దేశం నుంచి పారిపోయి యుకెలో ఉండగా వారి విషపదార్థంతో దాడి జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శలు గుప్పించిన సైనికాధికారి అలెగ్జాండర్ లుత్వింకోపై విష పదార్థంతో దాడి చేయడంతో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News