Monday, January 20, 2025

సెల్లార్లను ఇతర వాటికోసం వాడితే కఠిన చర్యలు: రోనాల్డ్ రాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాపర్టీ టాక్స్ అనేది చాలా ముఖ్యమైన అంశమని, ప్రాపర్టీ టాక్స్ అనేది జిహెచ్ఎంసికి మేజర్ ఆదాయ మార్గమని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్ లో ప్రాపర్టీ టాక్స్ అంశం పై చర్చ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడారు. టాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని, సమీక్షల్లో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామని, జిహెచ్ఎంసి ఆదాయ మార్గాల వేటలో ఆయా పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేసుకున్నామని రోనాల్డ్ రాస్ వివరించారు.

రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్ పై టాక్స్ వేరు వేరు రేట్లు ఉన్నాయని, రేట్ల మార్పుపై 2017లో ఒకసారి 2019లో జీవోలు విడుదలయ్యాయని, డిగ్నిటీ హౌసెస్ కు డోర్ నంబర్స్ వేసేందుకు యాక్షన్ మొదలయిందని, ఓయో హాస్టల్ పై విచారణ చేసి టాక్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు.  సెల్ఫ్ అసిస్మెంట్ పై త్వరలోనే పూర్తి ప్రకటన చేస్తామని, జిఐఎస్ మ్యాప్ ను జిహెచ్ఎంసి త్వరలోనే మళ్ళీ గ్రౌండ్ చేస్తామని, టాక్స్ వసూళ్లలో చట్టం ప్రకారం వెళ్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ వేస్తున్నామని తెలిపారు. సిటిలో సెల్లార్ లను పార్కింగ్ పై పోలీస్ – జిహెచ్ఎంసి జాయింట్ సర్వే చేస్తున్నామని, పార్కింగ్ కోసం ఉన్న సెల్లార్ లను ఇతర వాటికోసం వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని రోనాల్డ్ రాస్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News