Sunday, December 22, 2024

అన్నారం, మేడిగడ్డ సేఫ్టీపై తనిఖీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/కాళేశ్వరం : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్బాగంగా గోదావరి నదిపై ఉన్న బ్యారేజిలను డ్యామ్ సేఫ్ట్టీ అథారిటి నిపుణుల బృందం పరిశీలించింది. మంగళవారం కాళేశ్వరం ఇఎన్‌సి సుధాకర్‌రెడ్డి డ్యామ్‌సేఫ్టీ అథారిటి బృందానికి అన్నారం , మేగిగడ్డ బ్యారేజిలను చూపించారు. తొలుత ఈ బృందం అన్నారం బ్యారేజిని పరిశీలించింది. బ్యారేజిలో నిలువ ఉన్న 2.5టిఎంసీలను రెండు రోజుల కిందటే గేట్లు ఎత్తిదిగువకు విడుల చేయయటంతో డ్యామ్‌సేఫ్టీ బృందం వ చ్చేసరికి బ్యారేజీ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో బృందంలో అధికారులు బ్యారేజి దిగువకు దిగి అన్ని కోణాలనుంచి బ్యారేజికి జరిగిన నష్టాలను క్షు ణ్ణంగా పరిశీలించారు. బ్యారేజిలో 28,38 గేట్లకు సమీపాన ఎగువ భా గంలో పెద్ద బుంగలు ఏర్పడటంతో బ్యారేజిలోని నీరంతా గేట్లకు దిగువ భా గాన ఫౌంటెన్‌లో ఉబికి వస్తోంది. అంతే కాకుండా సుందిళ్ల బ్యారేజి దిగువ భాగంలో నిర్మించిన కాంక్రిట్ బ్లాకులు , ఆఫ్రాన్‌లు దెబ్బతిన్న ప్రాంతాలను కూడా పరిశీలించింది.

బ్యారేజి డిజైన్ , డ్రాయింగ్ లోపాలు కూడా బ్యారేజి దెబ్బతినేందుకు కారణం అని కాగ్ నివేదించడంతో ఆ కోణంలో కూడా డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలన చేసింది.బ్యారేజి నుంచి ఉబికి వస్తున్న నీటి ఊటలకు గల కారణాలపై కూడా ఆరా తీసింది. బ్యారేజిలో దెబ్బతిన్న ప్రాంతాలను సరిచేసేందుకు ప్రభుత్వం ఆప్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.ఈ సంస్థ ఇప్పటికే బ్యారేజిలో బుంగలు ఏర్పడ్డ ప్రాంతంలో కెమికల్ గౌటింగ్ పనులు చేసింది. అయినప్పటికీ మరో చోట నీటి లీకేజిలు ఉండటంతో నీటి ఊటలు వచ్చేందుకు కారణాలు అన్వేషించేందకు , బ్యారేజిలో ఉన్న లోపాలను కనిపెట్టేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించింది . డ్యామ్ సేప్టి అథారిటి బృందం ఈ ప్రాంతాలను కూడా పరిశీలించింది. ఆప్కాన్, పార్సన్ సంస్థల ప్రతినిధులతో కూడా అన్నారం బ్యారేజికి జరిగిన నష్టాలకు గల కారణాలను ఆరా తీసింది. బ్యారేజిలో నీటిని పూర్తిగా ఖాళీ చేయటంతో బ్యారేజికి ఎగువ భాగాన పెద్ద ఎత్తుత ఇసుక మేటలు బయటపడ్డాయి. బ్యారేజి పొడవున 1.6కిలోమీటర్ల వరకూ లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకు పోయింది . ఇసుకను తొలగిస్తే బ్యారేజి ఫౌండేషన్‌లో ఉన్న లోపాలు, పియర్స్ పటిష్టత ,తదితర అంశాలను పరిశీలించి ఒక నిర్ణార్ధారణకు వచ్చే అవకాశాలు ఉంటాయని డ్యామ్ సేఫ్టి అథారిటి నిపుణుల బృందం అభిప్రాయపడింది.
మేడిగడ్డ బ్యారేజిపై లోతుగా అధ్యయనం : అన్నారం బ్యారేజికి దిగువ ఉన్న మేడిగడ్డ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అత్యంత కీలకమైనది కావటంతో డ్యామ్ సేప్టి అథారిటి నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజికి జరిగిన ప్రమాదంపై లోతుగా అధ్యయనం చేపట్టింది. బ్యారేజిలో మొత్తం 84 గేట్లలో ఏడవ బ్లాకు పరిధిలోని 20వ పిల్లర్ భూమిలోకి నిలువునా కుంగిపోయిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించింది. ఎడమవైపునకు ఒరిగిపోవటానికి గల కారణాలను ఆరా తీసింది. పియర్‌కు భారీగా క్రాక్ రావటానికి నాణ్యతాలోపాలు కారణమా అన్న కోణంలో ఆరా తీసింది. 21వ పిల్లర్ నిలువునా చీలిక పడటాన్ని కూడా పరిశీలిన చేసింది. 18వ పిల్లర్ దిగువ భాగాన బ్యారేజి ఎగువ నుంచి దిగువకు నీరు ఉబికి వస్తున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. బృందం మరో దఫా రెండు బ్యారేజిలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News