క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్ ఆటకు విరామం చెప్పి పదేళ్లు దాటి ఉండవచ్చు. కానీ అతను నెలకొల్పిన రికార్డులు, అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. అందుకే.. క్రికెట్ లెజెండ్ సచిన్ పట్ల ప్రజలకున్న గౌరవాభిమానాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. సచిన్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో విప్పి చెప్పే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది.
సచిన్ తన కుటుంబంతో కలసి ఇటీవల విమానంలో జమ్ము కాశ్మీర్ కు వెళ్తున్నాడు. ఫ్లైట్ లో అతన్ని చూసిన మిగతా ప్రయాణికులు ‘సచిన్.. సచిన్’ అంటూ సచిన్ నామస్మరణ చేయడం మొదలుపెట్టారు. దాంతో సచిన్ వారు ముందుకు వచ్చి నమస్కరిస్తూ ‘థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్’ అంటూ వారి అభినందనలు అందుకున్నాడు. ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అవుతోంది!
When the entire flight turns into a stadium with Sachinnn Sachinnn Chants 🥳 @sachin_rt pic.twitter.com/fpXiDTvARA
— Sachin Tendulkar Fan Club (@OmgSachin) February 20, 2024