Monday, December 23, 2024

మనీ లాండరింగ్ కేసులో సినీ నటి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి, బిజేపి నాయకురాలు జయలక్ష్మిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిధుల దుర్వినియోగానికి, డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడినట్లు వచ్చిన అభియోగాలపై ఎగ్మూర్ కోర్టు ఆదేశాల మేరకు ఆమెను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

సినీ గేయ రచయిత, మక్కల్ నీతి మయ్యం నాయకుడు అయిన స్నేహన్ గతంలో స్నేహం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ తరఫున జయలక్ష్మి సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి డబ్బు వసూలు చేస్తోందని స్నేహన్ ఎగ్మూర్ కోర్టులో కేసు వేశారు. కాగా తన పరువును దెబ్బతీసే ఉద్దేశంతో స్నేహన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ జయలక్ష్మి కూడా గతంలో కోర్టుకెక్కారు. తాజాగా ఎగ్మూర్ కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమంగళం పోలీసులు జయలక్ష్మిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో జయలక్ష్మి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు వ్యాన్ లో తాను రానంటూ ఆమె తన సొంత కారులోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

గతంలో జయలక్ష్మి చెన్నై90వ వార్డులో బిజేపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక స్నేహన్.. పరంపోరుల్ అనే మూవీకి పాటలు రాయడం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News