Monday, December 23, 2024

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లఖిసరాయి (బీహార్) : బీహార్ లఖిసరాయి జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యక్తులు మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. లఖిసరాయి- సికంద్ర మెయిన్ రోడ్డుపై బిహారావురా గ్రామంలో బుధవారం తెల్లవారు జామున ఒక ట్రక్కు, టెంపో ఢీకొన్న దుర్ఘటనలో కనీసం తొమ్మిది మంది వ్యక్తులు మరణించారని, మరి ఐదుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వారు ఒక పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు లఖిసరాయి ఎస్‌పి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని ఆయన తెలిపారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News