Thursday, December 19, 2024

త్వరలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా జలాలపై బిఆర్‌ఎస్ నీటి పోరు యాత్ర చేయనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి పోరు యాత్రను బిఆర్‌ఎస్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల కృష్ణా జలాలలను రాష్ట్ర ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండలో భారీ సభ నిర్వహించిన బిఆర్‌ఎస్, త్వరలోనే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News