Monday, December 23, 2024

రిసోర్స్ యాక్టివ్ ను ఆవిష్కరించిన నెస్లే హెల్త్ సైన్స్

- Advertisement -
- Advertisement -

ప్రతి ఒక్కరికీ జీవన నాణ్యతను పెంపొందించడానికి ఆహారం యొక్క శక్తిని వెలికి తీయాలనే తన ఉద్దేశానికి అనుగుణంగా, నెస్లే ఇండియా నేటి, రాబోయే తరాలకు రిసోర్స్ యాక్టివ్‌ను ప్రారంభించింది. ఇది యాక్టివ్‌గా ఉన్న మిలీనియల్స్ కు వారి ఆరోగ్య అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన బహుళ-ప్రయోజన, అధిక ప్రోటీన్ సప్లిమెంట్. దీని ప్రత్యేకమైన ‘న్యూ ఎడ్జ్ ఫార్ములా’తో, రిసోర్స్ యాక్టివ్‌ అనేది కండరాల కోసం నాణ్యమైన ప్రొటీన్లు, ఎముకల ఆరోగ్యానికి సుసంపన్నమైన కాల్షియం, విటమిన్-డి, చర్మ ఆరోగ్యం కోసం హైఅలురొనేట్ లను కలిగిఉంటుంది. ఇందులో ఫైబర్, ఇమ్యునోన్యూట్రియెంట్‌లు కూడా ఉన్నాయి. రిసోర్స్ యాక్టివ్ సప్లిమెంటేషన్ ద్వారా మిలీనియల్స్ పోషకాహార అవసరాల అంతరాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ సప్లిమెంట్ మార్కెట్ ఉన్నప్పటికీ, వ్యక్తుల నిర్దిష్ట అవసరాల కోసం రూపొందించిన ఉ త్పాదనల అవసరం ఉంది. 30 సంవత్సరాల వయస్సు తర్వాత, కండర ద్రవ్యరాశి అసంకల్పిత నష్టం ఉంటుందని అధ్యయనా లు* సూచిస్తున్నాయి. ఇది ఎముక సాంద్రత తగ్గడం, కణజాలం విచ్ఛిన్నం, చర్మం హైడ్రేషన్, స్థితిస్థాపకత కోల్పోవడం వంటి వృద్ధాప్య సంకేతాలకు కూడా దారి తీస్తుంది. రిసోర్స్ యాక్టివ్ అనేది ఈ వయస్సు వారికి పోషకాహార అవసరాలను తీర్చ డానికి అనుకూలీకరించబడింది. కండరాల ఆరోగ్యం, శక్తి, ఎముక ఆరోగ్యం, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. రుచికరమై న వనిల్లా బిస్కెట్ ఫ్లేవర్‌లో నీరు లేదా పాలతో రిసోర్స్ యాక్టివ్ వినియోగదారులు దీన్ని తాగి ఆనందించవచ్చు.

ఈ ఆవిష్కరణ గురించి నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ మాట్లాడుతూ.. “నెస్లే ఇండియా శక్తి వంతమైన బ్రాండ్‌లు, ఉత్పత్తుల ద్వారా తన వినియోగదారుల జీవితాలకు విలువను జోడించడానికి నిరంతర ప్రయా ణంలో ఉంది. మిలీనియల్స్‌ తో సహా చురుకైన పెద్దలకు రిసోర్స్ యాక్టివ్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. రిసోర్స్ యాక్టివ్ విస్తృతమైన పరిశోధన ఫలితం. నెస్లే నాణ్యత, భద్రత హామీ మద్దతు కలిగిఉంటుంది. ఈ బ్రాండ్ క్రియాశీల మిలీనియ ల్స్ పోషక అవసరాలను భర్తీ చేయగలదని, వారు చురుకైన జీవితాన్ని గడపడంలో సహాయపడగలదని మేం విశ్వసిస్తు న్నాం’’ అని అన్నారు.

రిసోర్స్ యాక్టివ్ దిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, పుణె, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం మొదలైన 11 నగరాల్లోని జాతీయ ఫార్మసీలు, స్థానిక మందుల దుకాణాలతో పాటుగా ఇకామర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

న్యూట్రీషియన్ సైన్స్ రంగంలో నెస్లే హెల్త్ సైన్స్ అంతర్జాతీయ అగ్రగామి. వినియోగదారులు, రోగులు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణలో తన భాగస్వాముల కోసం ఆరోగ్య నిర్వహణ తీరుతెన్నులను మార్చడానికి పోషకాహారం చికిత్స పాత్రను అభివృద్ధి చేయడంపై ఇది దృష్టి పెడుతుంది. కీలకమైన ఉత్పత్తులలో రిసోర్స్ హై ప్రొటీన్, పెప్టామెన్, ఆప్టిఫాస్ట్, రిసోర్స్ డయాబెటిక్, రిసోర్స్ ఫైబర్ ఛాయిస్, చిక్కన్ అప్ క్లియర్, రీసోర్స్ రెనల్ మరియు రిసోర్స్ డయాలసిస్ ఉన్నాయి. నెస్లే హెల్త్ సైన్స్‌ లో అవగాహన, విద్య కోసం భారతదేశం అంతటా ఆరోగ్య సంరక్షణ నిపుణులతో నిమగ్నమైన క్లినికల్ నిపుణుల ప్రత్యేక బృందం కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News