- Advertisement -
ముంబై : మహారాష్ట్రలోని బుల్దానాలో మతపరమైన కార్యక్రమంలో పంపిణీ చేసిన ప్రసాదం వికటించింది. కలుషిత ప్రసాదంతో దాదాపు 200 మంది వరకూ తీవ్ర అస్థస్థతకు గురయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. చికిత్స తరువాత చాలా మందిని డిశ్చార్జ్ చేశారని కలెక్టర్ కిరణ్ పటేల్ తెలిపారు. మంగళవారం రాత్రి లోనార్ తాలూక సోంథానా గ్రామంలో హరినామ్ శపథ్ అనే దీక్షా కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది భక్తులు తరలివచ్చారు. స్థానికంగా ఆసుపత్రిలో సరైన చికిత్స ఏర్పాట్లు లేకపోవడంతో అస్వస్థతకు గురైన వారికి అక్కడ ఆరుబయటనే చెట్లకు తాళ్లు కట్టి సైలెన్లు అమర్చారు. అంతా కోలుకున్నారని అధికారులు తెలిపారు.
- Advertisement -