Monday, December 23, 2024

రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రైతుల నిరసనల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చెరకు పంటకు గిట్టుబాటు ధర పెంపు చరిత్రాత్మక నిర్ణయమని ప్రసంశించారు. కోట్లాది మంది రైతులకు ఇది ప్రయోజనకరమని తెలిపారు. చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు పంపిన విషయం తెలిసిందే. క్వింటా చెరుకు ధర రూ.315 నుంచి రూ.340 రూపాయలకు పెంచిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News