Wednesday, December 4, 2024

మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ములుగు: మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రేపు చాలా మంది కేంద్రమంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని పేర్కొన్నారు. గురువారం మేడారంలో సమ్మక్కసారలమ్మ అనే వన దేవతలను కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మేడారంలో నిలువెత్తు బంగారం ఆయన సమర్పించారు. అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని కిషన్ రెడ్డి చెప్పారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని, వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ ఏడాదే ప్రవేశాలకు అనుమతి ఇస్తామని, ములుగులో గిరిజన వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అమ్మవార్ల దయ అని తెలియజేశారు. వర్సిటీ భవనాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని, యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామన్నారు. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News