Monday, December 23, 2024

రూ.900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ

- Advertisement -
- Advertisement -

ములుగు  : మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి హెలిపాడ్ నుండి నేరుగా సమ్మక్క గుడికి గురువారం చేరుకొని తల్లుల దర్శనం చేసుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. మేడారం జాతరకు 3 కోట్ల 14 లక్షలను కేంద్రం అందించిందని అన్నారు. 900 కోట్లతో సమ్మక్క -సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.

జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు. అందులో స్థానిక గిరిజన బిడ్డలకే అత్యధిక సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నూతన యూనివర్సిటీ అయినందున సలహాదారుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపట్టి త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ఏజెన్సీలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 337 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సేకరించారని, మరింత భూమి సేకరించాల్సి ఉందన్నారు. శుక్రవారం కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారం రానున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News