- Advertisement -
కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత(37) మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై నందిత కారు ప్రమదానికి గురైంది. ఘటనాస్థలిలోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. అదుపుతప్పిన కారు రెయిలింగ్ ను ఢీకొట్టింది. కారు డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో నందిత పిఎ ఆకాస్ కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -